దీర్ఘకాలం రోగాలను నయం చేస్తామంటూ...

మీరు దీర్ఘకాలంగా నయం కాని రోగాలతో బాధ పడుతున్నారా... గ్యారంటీగా నయం చేసే మందులు మావద్ద ఉన్నాయి. మూడు నెలల్లో మీ రోగాలు మటుమాయం అంటూ మాయమాటలతో నకిలీ ఆయుర్వేద మందులు అమ్మే 19 మంది మోసగాళ్ళను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.వారి నుంచి రెండు లక్షల నగదు, నకిలీ మందులు.11 ద్విచక్ర వాహనాలు 24 సెల్ పోన్లు స్వాధీనం చేసుకున్నారు. చాలా కాలం నుంచి పీడిస్తున్న రోగాల నుంచి విముక్తి చేస్తామంటూ ఎస్.ఆర్.నగర్.సుల్తాన్ బజార్. సైఫాబాద్. అంబర్ పేట్ ప్రాంతాలలో మోసగాళ్ళు దుకాణాలు తెరిచారు.ఎలాంటి రోగాలనైనా మాయంచేసే ఆయుర్వేదిక్ మందుల పేరుతో నకిలీ మందులు విక్రయించారు. ఫైనాన్సియల్ స్టేటస్ ను బట్టి రోగుల నుంచి 25 వేల నుంచి రెండు లక్షల వరకు వసూలు చేశారు.విశ్వసనీయ సమాచారంతో కర్నాటక బెల్గాం జిల్లా కు చెందిన మూడు గ్యాంగ్ లను అదుపులోకి తీసుకున్నారు.రాజు హవప్పశెట్టి.గోవింద్ ఎల్లప్ప.కల్లోలి సిద్దప్ప.గురుగప్ప గోవింద్, ఆనంద్ గోవిందప్ప, అనిల్ దుర్గప్ప, దేవెందర్, పరుశరాం, గోపి గోవిందప్ప, మారుతి, సురేశ్ దుర్గప్ప, కుమార్ దేశాయ్, మహ్మద్ కాటప్ప, సోమప్ప, బహుల్కోటి దేశాయ్, గోవింద్ స్వామి, శంకర్, సతీష్, శరత్ లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.నాలుగు గదులను అద్దెకు తీసుకుని ఈ నకిలీ దందా నడిపిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.నిందితుల్లో కొందరిపై గతంలో హైదరాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు ఉన్నాయని అదనపు డిసిపి శశిధర్ రాజు తెలిపారు.
- Tags
- నకిలీ మందులు

