థర్టీ ఇయర్స్ అన్నా ఈ పార్టీలో చెల్లదు

కాంగ్రెస్ పార్టీలో ఎంత స్వేచ్ఛ ఉంటుందో అంత నియంతృత్వం ఉంటుంది. ఎవరు పార్టీలో ఉండాలి ఎవరు బయటకుపోవాలో అధిష్టానమే డిసైడ్ చేస్తుంది. మేం థర్టీ ఇయర్స్ , ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్నా అక్కడ చెల్లదు . టెన్ జన్ పథ్ చెప్పిందే ఫైనల్. అలా ఇష్టం ఉంటేనే పార్టీలో ఉండటం లేదా బయటకు పోవడం రెండే అప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారని సీఎం రేసులో వున్న సీనియర్స్ లో కలకలం రేగుతుంది. వారు ఎంత అడ్డు చెబుదామని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదన్న సంకేతాలు ఇచ్చేసింది హై కమాండ్.
రేవంత్ పై ఫిర్యాదుల వెల్లువ ....
రేవంత్ చేరికపై అయిష్టతతో వున్న కొందరు నాయకులు అధిష్టానానికి ఫిర్యాదులను వెల్లువలా పంపుతున్నారు. వారికి టి కాంగ్రెస్ కేంద్ర పరిశీలకుడు కుంతియా ఘాటుగా సమాధానం చెబుతున్నారట. మిమల్ని నమ్ముకుని తెలంగాణ ఇస్తే ఏం పీకారని టిఆర్ ఎస్ చేతిలో అధికారం పెట్టారు చాలు చాలు అంటూనే , ఉంటే వుండండి పోతే పొమ్మనే రేంజ్ లో చెప్పడంతో అసంతృప్త వాదులు సైలెంట్ అయిపోతున్నారుట. దాంతో ఈ వ్యవహారంపై స్పందించేందుకు పలువురు నేతలు నోకామెంట్ అంటూ చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనమని పార్టీ వర్గాలు అంటున్నాయి.
పండు తలకాయలు మాత్రం రేవంత్ కి స్వాగతం ....
ఇక వి. హనుమంతరావు వంటి నేతలు అధిష్టానం మనసు తెలుసుకుని నడుచుకుంటూ జై రాహుల్ , జై రేవంత్ అని. జిందాబాద్ చెబుతున్నారు . టిడిపిని వదిలి ఎప్పుడో మేం రేవంత్ ను ఆహ్వానించామని వృద్ధ నేత విహెచ్ కామెంట్ కూడా చేశారు. ఇక రేణుకా చౌదరి అధిష్టానం చెప్పిందే ఫైనల్ అని తేల్చేశారు . వీరంతా కాంగ్రెస్ అధిష్టానం పట్ల తమ వీర విధేయతను మరోసారి చాటి చెప్పుకుంటున్నారు. ఇంతకీ కాంగ్రెస్ లో చేరే అసలు పెళ్ళికొడుకు రేవంత్ మాత్రం ముహూర్తం ఇప్పటివరకు తేల్చలేదు, అలాగే టిడిపిని వీడకపోవడం విశేషం .
- Tags
- కాంగ్రెస్

