Fri Apr 10 2026 22:45:03 GMT+0530 (India Standard Time)
తొలిరోజు జగన్ ఎంత నడిచారంటే?

తొలిరోజు జగన్ పాదయాత్ర ముగిసింది. మొత్తం తొలిరోజు 8.9 కిలోమీటర్లు జగన్ పాదయాత్ర చేశారు. ఇడుపులపాయ నుంచి ఈరోజు ఉదయం బయలుదేరిన జగన్ వేలాది మంది కార్యకర్తల మధ్య కొద్దిసేపటి క్రితం వేంపల్లికి చేరుకున్నారు. మొత్తం 8.9 కిలోమీటర్లు నడిచిన జగన్ ఆయన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంట్ లో రెస్ట్ తీసుకుంటారు. రాత్రికి వేంపల్లెలో బసచేసే జగన్ రేపు ఉదయం 8.30గంటలకు పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. ఇడెుపుల పాయ నుంచి చెప్పులతోనే పాదయాత్రగా బయలుదేరిన జగన్ బహిరంగ సభ ముగిసిన తర్వాత ప్రత్యేక షూతో పాదయాత్రను ప్రారంభించడం విశేషం.
- Tags
- జగన్
Next Story

