తొమ్మిదో సెంచరీ కొట్టేసిన జగన్ ...!

వైసిపి అధినేత జగన్ 67 వ రోజు పాదయాత్రలో 900 ల కిలోమీటర్లు అధిగమించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం చర్లోపల్లి వద్ద ఈ రికార్డ్ నమోదు చేశారు జగన్. 67 వ రోజు పాదయాత్ర పూర్తి అయ్యేటప్పటికి 909.7 కిలోమీటర్లు అధిగమించారు ఆయన. తన 900 ల కిలోమీటర్ల మార్క్ కి గుర్తుగా ఆ ప్రాంతంలో రావి మొక్క నాటారు వైసిపి అధినేత. రోజులాగే వైఎస్ తనయుడికి తండోపతండాలుగా తరలివచ్చి ప్రజలు యాత్రలో సంఘీభావం ప్రకటించారు. పాదయాత్ర విజయవంతంగా సాగుతున్న తీరుకి వైసిపి శ్రేణుల్లో ఉత్సహం వెల్లివిరుస్తుంది.
రాష్ట్రం తాకట్టు పెట్టి కోర్టు కి వెళతారా ...?
ఓటుకు నోటు కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు రాష్ట్రాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టారని జగన్ ఆరోపణలు గుప్పించారు. అందువల్లే ప్రత్యేక హోదా ఇతర విభజన సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయని విమర్శించారు. ఇన్ని చేసిన బాబు ఇప్పుడు కోర్ట్ కి వెళతా అంటూ కొత్త నాటకాలకు తెరతీసి ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ ఓట్ల కోసం వస్తారన్నారు జగన్. గతంలో వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్ట్ లకు 70 శాతం ఖర్చు చేస్తే మిగిలిన సొమ్ము ఖర్చు పెట్టి చిత్తూరు కి నీరు బాబు నాలుగేళ్లుగా తేలేకపోతున్నారని ధ్వజమెత్తారు వైసిపి నేత.
చేనేత మహిళలకు భరోసా ...
చేనేత పరిశ్రమే జీవనాధారంగా బతుకు బండి లాగుతూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు భరోసా ఇచ్చారు జగన్. నేతన్నల చీరలకు సరైన ధర వచ్చేలా చేస్తానని రెండువేలరూపాయలు పెన్షన్ గా అందించి ఆదుకుంటా అన్నారు ఆయన. వారి సమస్యలు ఒప్పిగ్గా విన్నారు. ఈ సందర్భంగా కూలీలు లభించడం లేదని పెట్టుబడులు సమస్యలు మహిళలు జగన్ కి విన్నవించారు.
- Tags
- జగన్

