Mon Feb 02 2026 07:57:15 GMT+0000 (Coordinated Universal Time)
తేడా వస్తే తోలు తీస్తా....!

చూడ్డానికి మెత్తగా కన్పిస్తా....తేడా వస్తే తోలు తీస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ ను హెచ్చరించారు. తాను విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికే వచ్చానన్నారు పవన్ కల్యాణ్. ఫ్యాక్షనిస్టులు వ్యక్తిగత విషయాలు మాట్లాడితే దాడులు చేయాల్సి వస్తుందని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వ్యక్తిగత ఆరోపణలకు దిగితే పారిపోతారన్నారు. చంద్రబాబు, జగన్ లాంటి వాళ్లు రాజ్యాంగం రాయలేరని చెప్పారు. అంబేద్కర్ లాంటి వాళ్లకే అది సాధ్యమన్నారు. ఇసుక దందాలు, కుంభకోణాలు చేసే వారు తనపై విమర్శలు చేస్తే ప్రజలు హర్షించరన్నారు. తాను ఏ భాష వాడాలో తెలిసిన వాడినన్నారు. కుంభకోణాలు చేసే వారికే ఇంత తెగింపు ఉంటే నిజాయితీగా ఉండే తనకు ఎంత తెగింపు ఉండాలని పవన్ ప్రశ్నించారు. నిన్న వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ ఈ విధంగా స్పందించారు.
Next Story
