తెలుగు రాష్ట్రాల రాజ్యసభ అభ్యర్థులు వీరేనా?

ఎన్నికల చివరివరకు ఆచితూచి అడుగులు వేయడం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, చంద్రశేఖర రావు లకు అలవాటే. తాజాగా ఇదే ఎత్తుగడలను బాబు, కేసీఆర్ అనుసరిస్తున్నారు. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు రాజ్య సభ స్థానాలకు ఉత్కంఠ నడుస్తుంది. ఈ ఆరు సీట్లలో వైసిపి నుంచి వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి ని ఇప్పటికే ఆ పార్టీ నామినేషన్ కూడా వేయించడంతో ఇక ఐదు సీట్లకు అభ్యర్థులు ఎవరన్నా అంశం చర్చనీయాంశంగా కొనసాగుతుంది. మరోవైపు సీఎం రమేష్ పేరు టీడీపి నుంచి దాదాపు ఖరారు అయినట్లేనని ఆ పార్టీ వర్గాల సమాచారం.
ఇక మిగిలిన నాలుగిటికి గట్టి పోటీ ....
కేసీఆర్ సైతం తన ఖాతాలో టీఆరెస్ కు ఎప్పటినుంచో సేవలు అందిస్తున్న సంతోష్ కి టికెట్ ఖరారు చేసినట్లు సమాచారం. మరో రెండు స్థానాల్లో యాదవులకు ఒకటి ఎస్సి, మైనారిటీ నేతలకోసం కేసీఆర్ కసరత్తు తీవ్రం చేశారు. ఏపీలో మరో వైపు టిడిపి రెండు స్థానాల కోసం మల్లగుల్లాలు పడుతుంది. టిడిపికి దక్కనున్నరెండు స్తానాల్లో ఎవరిని నిలపాలన్న దానిపై చంద్రబాబు దాదాపు కసరత్తు పూర్తి చేశారు. సీఎం రమేష్ కు మరోసారి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు దాదాపు నిర్ణయించినట్లు సమాచారం. అలాగే రెండో అభ్యర్థిగా వర్ల రామయ్యను ఖరారు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్సీ కోటా అందులో మాదిగ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్యను రాజ్యసభ అభ్యర్థిగా నిర్ణయించే అవకాశముంది. మరో పక్క వైజాగ్ కి చెందిన ఎంవిఎస్ మూర్తి రేసులో ముందున్నారని అంటున్నారు. ఎమ్యెల్సీ జూపూడి ప్రభాకరరావు వంటి వారు రాజ్యసభ టికెట్ కోసం అధినేత చుట్టూ ప్రదక్షిణాలు కొడుతున్నారు.
- Tags
- రాజ్యసభ
