Sat Apr 04 2026 17:34:42 GMT+0530 (India Standard Time)
తెలంగాణ మంత్రి కొడుకు కారు పై దాడి

తెలంగాణ మంత్రి అజ్మీరాచందూలాల్ కుమారుడు ప్రహ్లాద్ వాహనంపై ఆదివాసీలు దాడి చేశారు. కారును ధ్వంసంచేశారు. ప్రహ్లాద్ తో పాటు ఆయన అనుచరులు వచ్చిన వాహనాలను కూడా వారువదిలిపెట్టలేదు. మేడారం జాతర ట్రస్ట్ బోర్డులో ఇద్దరు లంబాడీ సభ్యులకు అవకాశం కల్పించడంపై గత కొంతకాలంగా ఆదివాసీలు ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. ట్రస్ట్ బోర్డు కునియమితులైన సభ్యులు ఈరోజు ప్రమాణస్వీకారం చేసేందుకు వస్తుండగా వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ట్రస్ట్ బోర్డు నుంచి వెంటనే ఆ ఇద్దరు లంబాడీ సభ్యులను తొలగించాలని డిమాండ్ చేశారు. పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. మేడారంలోని ఐటీడీఏ కార్యాలయానికి కూడా ఆందోళనకారులు నిప్పుపెట్టారు.
Next Story

