తలాక్ అన్నారో ఇక అంతే...

ట్రిపుల్ తలాక్ విధానంపై పార్లమెంటులో బిల్లు తెచ్చేందుకు కేంద్రప్రభుత్వం రెడీ అయింది. రేపు ఈ బిల్లు పార్లమెంటుకు రానుంది. పార్లమెంటు సమావేశాలకు విధిగా హాజరు కావాలని అందరు బీజేపీ ఎంపీలకు పార్టీ విప్ జారీ చేసింది. కీలకమైన బిల్లు కావడంతో ఎట్టిపరిస్థితుల్లో పార్లమెంటు సమావేశాలకు గైర్హాజరు కాకూడదని సమాచారం ప్రతి ఎంపీకి అందించారు. మోడీ సర్కార్ ట్రిపుల్ తలాక్ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ట్రిపుల్ తలాక్ కారణంగా ముస్లిం మహిళలు అధికసంఖ్యలో నష్టపోతున్నారని, ఇది అన్యాయమని సాక్షాత్తూ మోడీయే అనేక బహిరంగ సభల్లో పేర్కొన్నారు.
రేపు పార్లమెంటు ముందుకు బిల్లు....
దీంతో పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టి చట్టం చేయాలని మోడీ సర్కార్ భావించింది. అందుకోసమే రేపు ఈ బిల్లును పార్లమెంటు ముందుకు తేనున్నారు. వచ్చే కొత్త చట్ట ప్రకారం ట్రిపుల్ తలాక్ ను ఎవరు? ఏ రూపంలో చెప్పినా సరే మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశముంది. ఈ చట్టం వల్లనైనా కొందరు ఈ విధానానికి స్వస్తి పలుకుతారని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధమంటూ కొందరు ముస్లిం మహిళలే సుప్రీంకోర్టును ావ్రయించారు. అయితే ఈ విధానం రాజ్యాంగ బద్ధం కాదని, దీనికి సంబంధించిన బిల్లును తీసుకురావాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రేపు పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానాన్ని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు-2017 ను ఇప్పటికే కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇది బిల్లురూపంలోకి వస్తే ముస్లిం మహిళకు వరమేనని చెప్పొచ్చు.
- Tags
- ట్రిపుల్ తలాక్

