Mon Mar 30 2026 19:31:15 GMT+0530 (India Standard Time)
తనపై టీడీపీ నేతలు కుట్రచేస్తున్నారన్న బైరెడ్డి

తెలుగుదేశం పార్టీలోకి తాను రావడం ఇటీవల పార్టీలోకి చేరిన కొందరు నేతలకు ఇష్టం లేదని రాయలసీమ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. రఘునాధరెడ్డిపై జరిగిన దాడిని తనపై నెడుతున్నారన్నారు. రఘునాధరెడ్డి తన అనుచరుడనిబైరెడ్డి అన్నారు. తాను ఢిల్లీ లో ఉన్నప్పుడు తనపై కేసు పెట్టడం ఎంతవరకూ సబబన్నారు. పాణ్యం నియోజకవర్గానికి చెందిన బావమరుదులు ఆడుతున్న కుట్ర అని బైరెడ్డి అన్నారు. ఎలాంటి విచారణకైనా సిద్ధమని బైరెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమావేశమయిన సంగతి తెలిసిందే. ఆయన టీడీపీలో చేరికకు అంతా సిద్ధమయిన తరుణంలో కొందరు టీడీపీ నేతలు తనపై కుట్ర చే్స్తన్నారంటున్నారు బైరెడ్డి.
Next Story

