Thu Mar 26 2026 19:01:03 GMT+0530 (India Standard Time)
తన భద్రతపై డీజీపీకి పవన్

తనకు భద్రత కల్పించాలని పవన్ కల్యాణ్ ఏపీ డీజీపీకి లేఖ రాశారు. జనసేన ఆవిర్భావ సభ తర్వాత కూడా తనకు భద్రతను కొనసాగించాలని కోరారు. కుల పోరాటాలు, రాజకీయ విభేదాలతో తన భద్రత ముడిపడి ఉందని పవన్ కల్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో కుల ఉద్యమాలు, వర్గపోరాటాలు జరుగుతున్నాయన్నారు. రాజకీయ అణిచివేతల నడుమ తన భద్రత చాలా సున్నితమైనదని, సామాజిక, రాజకీయ సమస్యలతో ముడిపడి ఉందని, తనమీద దాడి జరిగితే తీవ్ర ప్రభావం చూపించే అవకాశముందని, తన భద్రతను కొనసాగించాలని కోరుతున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
- Tags
- పవన్ కల్యాణ్
Next Story

