తండ్రికి తగ్గ జేసీ తనయుడు

అనంతపురం జిల్లాకు చెందిన ఎంపీ జెసి దివాకరరెడ్డి సంచల వ్యాఖ్యలకు, చర్యలకు కేరాఫ్ అడ్రెస్. ఆయన ఎప్పుడు ఏమి మాట్లాడతారో, ఎవర్ని కొడతారో తిడతారో ఆయనకే తెలియదు. వివాదాస్పద నేతగా వుండే జెసి కాంగ్రెస్ పార్టీలో వున్న తరహాలోనే టిడిపిలో కూడా దూసుకుపోతున్నారు. ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుంది అంటారు. ఆయన తనయుడు పవన్ తండ్రిలాగే వివాదాస్పద వ్యాఖ్యలతో తాజాగా వార్తలకు ఎక్కారు.
అమరావతిలో నాన్న ఇలా అంటే ... అనంతపురంలో కొడుకు అలా ...
వచ్చే ఎన్నికల్లో వృద్ధనేతలంతా టికెట్లు వస్తాయో రావో వయోభారంతో పక్కన పెట్టామని అంటారేమో అన్న ఆందోళనతో తమ కుటుంబ సభ్యులను తెరమీదకు తెచ్చేశారు. అన్ని పార్టీల్లో ఇదే తంతు ప్రస్తుతం నడుస్తుంది. జెసి దివాకర రెడ్డి కూడా అందరిబాటలోనే వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా చంద్రబాబును కలిసి వచ్చే ఎన్నికల్లో టిడిపి తరపు పోటీకి అవకాశం ఇవ్వాలనే అభ్యర్ధన ఆయన ముందు పెట్టి వచ్చి మీడియా తో కూడా ఆ విషయాన్నీ వెల్లడించారు. ఆయన ఇలా వ్యాఖ్యలు చేశారో లేదో అనంతపురంలో ఆయన కుమారుడు పవన్ కార్యకర్తల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో వైసిపి గాలి రాయలసీమలో వీయడంతో టిడిపికి అభ్యర్ధే లేరని అన్నారు. అలాంటి దశలో దివాకర రెడ్డి టిడిపిలోకి వచ్చి ఆ పార్టీ కి జీవం పోశారన్నారు. తనతండ్రికి అడ్డువచ్చే నేతే అనంతపురంలో లేరని ప్రధాని వచ్చి పోటీ చేసినా, ముఖ్యమంత్రి వచ్చి పోటీ చేసినా తమ ముందు దిగదుడుపే అన్న స్థాయిలో హాట్ హాట్ వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా లో ఇదే టాపిక్ హాట్ టాపిక్ అయ్యింది. తండ్రి కొడుకులు విభిన్నంగా స్పందించిన వీడియోలు వైరల్ గా మారి హల్చల్ చేస్తున్నాయి. పుత్రరత్నం అన్న మాటలకు జెసి ఏమి చెబుతారో చూడాలి. సుపుత్ర కొంప ముంచావని అంటారా శభాష్ అంటారో మరి.
- Tags
- జేసీ

