డ్రగ్స్ వాడింది ఆ ఐదుగురిలో ఒకరేనా?

దేశంలో సంచలనం సృష్టించిన తెలంగాణ డ్రగ్స్ కేసు కీలక ఘట్టనికి చేరింది. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎఫ్.ఎస్.ఎల్ రిపోర్ట్ కోర్టు కు సమర్పించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు. రెండు రోజుల్లో ఎక్సైజ్ అండ్ ఎన్ ఫోర్స్ అధికారులకు రిపోర్టు రానుంది. 5 కేసుల్లో పాజిటివ్ గా నివేదిక వచ్చిందన్న వార్తలతో టాలీవుడ్ లో ఎవరు ఉన్నారనేది అసక్తిగా మారింది.
నిందితులా? బాధితులా?
డ్రగ్స్ కేసు విచారణ మళ్లీ ఊపందుకోనుంది. ఆరు నెలలుగా ఎన్నో అపవాదులను మూటకట్టుకున్న ఎక్సైజ్, ఎన్ ఫోర్స్ మెంట్ ఎఫ్.ఎస్.ఎల్ రిపోర్టుతో నిందితుల పై చార్జీషీట్ దాఖలు చేయనుంది. కేసులో కీలక నిందితుడు కాల్వీన్ లో పాటు మొత్తం 12 మంది వద్ద నమూనాలను సేకరించారు. వీరిలో సినిమా ఇండ్రస్టీకి చెందిన పూరి జగన్నాధ్, హీరో తరుణ్, సుబ్బారాజులు ఉన్నారు. 12 మంది సినిమా నటులను విచారించినా అందరూ శాంపిల్స్ ఇచ్చేందుకు ఇష్టపడలేదు. 5 కేసుల్లో నివేదిక ఇచ్చిన ఫోరెన్సిక్ అధికారులు అవి డ్రగ్స్ వాడినవారివేనని చెబుతున్నారు. అయితే ఆ 5గురు ఎవరనేది సస్పెన్స్ కొనసాగుతోంది...; పూరి జగన్నాథ్ , తరుణ్, రవితేజ, ముమైత్ ఖాన్, సుబ్బరాజుల్లో ఏ ఒక్కరి పేర్లు ఉన్నా.. మళ్లీ ప్రకంపనలు సృష్టించనున్నాయి. కార్పోరేట్ స్కూల్స్ , ఐ.టీ. కంపెనీల్లో డ్రగ్స్ విచ్చల విడిగా వాడే వారని సిట్ తెల్చింది. కాని విచారణలో మాత్రం వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. సినిమా పరిశ్రమ విషయంలో హాడవుడి చేసినా.. కేసు నిలబడే ప్రసక్తి లేదని .. ప్రచారం కోసమే విచారణ చేశారని గత ఆరు నెలలుగా ఎక్సైజ్ శాఖ అపవాదును మూటకట్టుకుంది. ఎన్డీఫిఎస్ యాక్ట్ ద్వారా డ్రగ్స్ వాడితే వాళ్లు బాధితులుగా పరిగణించాలి. అయితే అదే డ్రగ్స్ ను అమ్మితే.. నిందితులుగా ఉంటారు. అయితే డ్రగ్స్ వాడినట్లు రిపోర్టులు వచ్చిన వారు వినియోగించారా.. లేక అమ్మకాలు జరిపారా అనేది ఎక్సైజ్ శాఖ సిట్ తెల్చనుంది. ఈ ఏడాదిలోనే అత్యంత ప్రచారం పొందిన డ్రగ్స్ రాకేట్ కేసులో కఠినమయిన శిక్షలుపడతాయా..; లేక హాడవుడి చేసిన అన్ని కేసుల్ల వీగిపోతాయ అనేది చూడాల్సి ఉంది.
- Tags
- డ్రగ్స్ కేసు

