డిజిటల్ యుగం వైపు గోవా ఆఫర్ బాగుంది

దేశ ప్రజలందరినీ ఆర్ధిక లావాదేవి ల పరంగా డిజిటల్ యుగం వైపు నడిపించడానికి దాదాపుగా అన్ని రాష్ట్రాలు తమవంతు ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలే యాప్ లు తయారుచేసే బాధ్యత నెత్తికెత్తుకుంటున్నాయి. అయితే ప్రభుత్వాలు ఇప్పటిదాకా ప్రకటించిన వాటిలో గోవా ప్రభుత్వం వారి తాయిలం కాస్త ఆచారణాత్మకంగా కనిపిస్తోంది.
ప్రజలను డిజిటల్ వైపు నడిపించడానికి ఒక్కొక్కరు ఒక్కో ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు ఏకంగా పేదల్లో ఇంటికి ఒక స్మార్ట్ ఫోన్ సంక్రాంతి నాటికీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అయితే గోవా సర్కారు కాస్త భిన్నంగా అలోచించి యువతకు డేటా ప్యాకేజీ ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయించింది. దీనివల్ల కుటుంబానికి ఒకరు వాడినా సరే ఆన్ లైన్ లావాదేవీలు జరుగుతాయని భావిస్తున్నారు.
నిజానికి మొబైల్ ఫోన్ ఇవ్వడం కంటే ఇదే మంచి ఆఫర్ అని పలువురు అంటున్నారు. విధిగా కొన్ని ఆన్ లైన్ లావాదేవీలు చేస్తేనే ఈ డేటా ఫ్రీ వర్తించేలా నిబంధనలు. పెడితే, మెరుగైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు.

