డల్లాస్ లో తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి

అమెరికాలోని డల్లాస్ లో తెలంగాణ రాష్ట్రానికి చెంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి వెంకన్నగారి కృష్ణ చైతన్య అనుమానస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. శుక్రవారం ఉదయం పేయింగ్ గెస్ట్ గా ఉంటున్న ఇంట్లో తన రూం నుంటి బయటకు రాకపోవటంతో అనుమానం తో పోలీసులకు సమాచారాన్నిఇంటి జమానిఇచ్చారు.
పోలీసులు తలుపు తీసి చూడగా మంచం మీదనే కృష్ణ చైతన్య చనిపోయి ఉన్నారు. కృష్ణ చైతన్య స్వగ్రామం సిద్ధిపేటలోని ప్రశాంత్ నగర్. కాగ్నిజెంట్ సంస్థలో ఉద్యోగం రావడంతో మూడున్నరేళ్ల క్రితం కృష్ణ చైతన్య అమెరికా వెల్లారు. మూడు నెలల క్రితమే డల్లాస్ లోని సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ కు బదిలీ అయ్యారు. అక్కడ ఓ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా కృష్ణ చైతన్య ఉంటున్నారు. కృష్ణ చైతన్య మృతికి కారణాలు తెలియరాలేదు. తెలంగాణ ఎన్ ఆర్ఐ విభాగం నేతలు గోలి మోహన్, శ్రీధర్ మాధవనేనిలు కృష్ణ చైతన్య మృతదేహాన్ని స్వస్థలానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరుపున మంత్రి హరీశ్ రావు అక్కడి అధికారులతో మాట్లాడారు. గురువారానికి కృష్ణ చైతన్య మృతదేహం ఇక్కడకు చేరే అవకాశముంది.

