Sun Mar 29 2026 08:52:50 GMT+0530 (India Standard Time)
టీడీపీలో విషాదం...!

టీడీపీ మాజీ పార్లమెంటుసభ్యులు, మాజీ కేంద్రమంత్రి బోళ్ల బుల్లిరామయ్య మృతి చెందారు. బోళ్ల బుల్లిరామయ్య వయస్సు 92 సంవత్సరాలు. ఆయన నాలుగు సార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. బోళ్ల బుల్లిరామయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన స్వగ్రామం తణుకు. టీడీపీ సీనియర్ నేత కన్నుమూయడంతో టీడీపీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రామయ్య మృతికి పలువురు టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
- Tags
- టీడీపీ
Next Story

