Thu Mar 26 2026 11:40:20 GMT+0530 (India Standard Time)
టీడీపీకి పెరుగుతున్న మద్దతు

తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంపై పెట్టనున్న అవిశ్వాసానికి మద్దతు పెరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు రావడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమత బెనర్జీ స్వాగతించారు. టీడీపీ అవిశ్వాసానికి మమత మద్దతు ప్రకటించారు. దేశం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని మమత కోరారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఇప్పటికే వైసీపీ లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే వైసీపీ అవిశ్వాసానికి తాము మద్దతు ప్రకటించబోమన్న టీడీపీ తాము సొంతంగా అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమవుతుంది. దాదాపు 54 మంది ఎంపీల సంతకాలు సేకరించనున్నట్లు టీడీపీ ఎంపీలు చెప్పారు. అయితేశివసేన మాత్రం తాము అవిశ్వాసానికి మద్దతిచ్చేది లేనిదీ మధ్యాహ్నం తెలియజేస్తామని చెప్పింది.
- Tags
- టీడీపీ
Next Story

