Tue Mar 31 2026 18:16:36 GMT+0530 (India Standard Time)
టీడీపీ నేతల సమావేశంలో బాబు కీలక వ్యాఖ్యలు...!

టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీతో భేటీ వివరాలను చంద్రబాబు టీడీపీ నేతల ముందుంచారు. గతంలో కంటే కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. ప్రధాని మోడీ కూడా రాష్ట్ర సమస్యలపై సానుకూలంగా స్పందించారన్నారు. విభజన హామీలు నెరవేరే వాతావరణం కన్పిస్తుందని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన కూడా జరిగే అవకాశముందని, ఈ మేరకు తనకు సంకేతాలున్నాయని చంద్రబాబు నేతలకు చెప్పారు. అయితే తాను కోర్టుకు వెళతానన్న వ్యాఖ్యను మీడియా వక్రీకరించిందన్నారు. సమస్య పరిష్కారం కానప్పుడు సహజంగా ఉండే హక్కును వినియోగించుకోవడంలో తప్పేముందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా తాను ఆ వ్యాఖ్యను చేయలేదన్నారు.
- Tags
- చంద్రబాబు
Next Story

