టీఆర్ ఎస్ నేతకు మూడొస్తే మూడు ముళ్లే...!

టిఅర్ ఎస్ నేత శ్రీనివాస్ రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మూడొచ్చిన ప్రతిసారీ మూడు ముళ్లు వేసి అమ్మాయిలను తన చుట్టు తిప్పుకున్నట్లుగా బయటపడింది. ఇప్పటికి ముగ్గురిని వివాహాలు చేసుకుని చిత్రహింసలు చేస్తున్నాడు టిఅర్ ఎస్ నాయకుడు. తాతాల నుంచి వచ్చిన ఆస్తీని ఎంజాయ్ చేస్తూ అమ్మాయిలను ఆట బొమ్మలుగా చూస్తున్న శ్రీనివాస్ రెడ్డిని చివరకు పోలీసులు అరెస్టు చేసి కటాకటాల వెనక్కి నెట్టారు. ఏడు సంవత్సరాల క్రితం శ్రీనివాస్ రెడ్డి స్వాతిల కు వివాహం జరిగింది. వివాహం సమయంలో వీళ్ల స్టేటస్ చూసి కోటి రూపాయల కట్నం క్రింద స్వాతి కుటుబ సభ్యులు ఇచ్చారు. బాగా పలుకు బడితో పాటుగా డబ్బున్న శ్రీనివాస్ రెడ్డికి లేని అలవాటు అంటూ ఏదీ లేదు. అన్నింటికి బానిసే.. వివాహం అయిన నెల రొజులకే అసలు విషయం స్వాతికి బొధ పడింది. తిరుగుబోతు, తాగుబోతు అని తేలింది.. దీంతో శ్రీనివాస్ పద్ధతులను మార్చుకోవాలని నచ్చ జెప్పింది స్వాతి. ఇది శ్రీనివాస్ రెడ్డికి నచ్చలేదు. నచ్చక పొగా.. తననే మారమంటావా అన....చిత్రహింసలు పెట్టడడం మొదలు పెట్టారు. నిత్యం రాత్రి సమయంలో చుక్కలు చూపించేవాడు.. చిత్రహింసలు భరించలేక స్వాతి రోదనలు చేసేది.. అయితే మూడు స్లారు పెద్దల సమక్షంలో శ్రీనివాస్ రెడ్డికి బుద్ధి చెప్పినా పరిస్థితి మారలేదు. దీంతో స్వాతి విడిపొవాలని అనుకుంది. తన కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. పెద్దల సమక్షంలో శ్రీనివాస్ రెడ్డితో విడాకులు తీసుకుంది. ఈ సమయంలో ఐదు కోట్ల రూపాయలను నష్ట పరిహారం క్రింద స్వాతికి చెల్లించాడు శ్రీనివాస్ రెడ్డి. స్వాతి విడాకులు తీసుకొవడంతో మళ్లీ వివాహం చేసుకొవాలని అనుకున్నాడు శ్రీనివాస్ రెడ్డి.
సంగీతను రెండో వివాహం....
శేరిలింగం పల్లికి చెందిన సంగీతను రెండో వివాహం చేసుకున్నాడు. వివాహం సమయంలో వీరు పెద్ద మొత్తంలో కట్నం సమర్పించుకున్నారు శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి. అయితే సంగీత వివాహం అయిన తరువాత కొన్నాళ్లకే కూతురు పుట్టింది. ఆడపిల్ల పుట్టడంతో శ్రీనివాస్ రెడ్డి జీర్ణించుకోలేక పొయాడు. ఆడపిల్ల పుట్టిందని సంగీతనువేధించడం ఆరంభించాడు. ప్రతినిత్యం చిత్రహింసలకు గురిచేసేవాడు. తనకు కొడుకు పుడుతాడని అనుకుంటే ఆడపిల్ల పుట్టిందని ప్రతినిత్యం సంగీతను కొట్టే వాడు. ఇలా చిత్రహింసలు భరించలేక సంగీత తన పుట్టింటికి వెళ్లిపొయింది.. గత సంవత్సరన్నర నుంచి సంగీత తన పుట్టింటి దగ్గరే వుండిపొయింది. ఇదిలా వుంటే తాను కాపురంచేయాలంటే పెద్ద మొత్తంలో కట్నం తీసుకుని రావాలని డిమాండ్ చేశాడు శ్రీనివాస్ రెడ్డి.. అంత డబ్బుల తాము ఇచ్చుకోలేమని సంగీత ప్రాధేయ పడింది..అయినప్పటికి శ్రీనివాస్ రెడ్డి వినిపించుకొలేదు. సరిగదా.. డబ్బులు వుంటే తన దగ్గర రావాలని చెప్పాడు. దీంతో మియాపూర్ పోలీస్ స్టేషన్ లో వరకట్న వేధింపుల కేసును సంగీత నమోదు చేసింది. అప్పడు పోలీసులు శ్రీనివాస్ రెడ్డితో పాటుగా అతని కుటుంబ సభ్యులను అరెస్టు చేసి కటాకటాల వెనక్కి నెట్టారు.
ఎన్ని కేసులు పెట్టినా....
ఇక పొతే అప్పటికీ శ్రీనివాస్ రెడ్డి కుటుంబంలో కూడా మార్పు రాలేదు. తనకూతురుతో కలిసి జీవించడం కష్టం గా మారిందని చెప్పి భరణం ఇవ్వాలని కోరుతూ కొర్టులో పిటిషన్ వేసింది. అయితే ఈకేసు పెండింగ్ లో వుంది. మరొక వైపు ఒక సారి తనకూతురు తో కలిసి శ్రీనివాస్ రెడ్డి దగ్గరకు వచ్చినప్పడు దాడి చేశాడు. దీంతో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది సంగీత.. గత ఏడాదిన్నరనుంచి శ్రీనివాస్ రెడ్డి.. సంగీత ల మధ్య వివాదాం జరుగుతునే వున్నాయి. ఇదిలా వుంటేతన ఇంట్లో పనిచేసే జగదేశ్వరి దేవిని లవ్ చేశాడు .. ఈ లవ్ నుకాస్తా వివాహం చేసుకొవాలని అనుకున్నాడు.దీంతో కొన్ని నెలల క్రితం గుట్టు చప్పడు కాకుండా యాద్రాదికి వెళ్లి మూడో వివాహం చేసుకునివచ్చాడు. ఈ మ్యారేజిగురించి తెలిసి శ్రీనివాస్ రెడ్డికి ఇంటికి వెళ్లినిలదీయగా సంగీతపైన దాడిచేశాడు. దీంతో తన పైన దాడిచేసినందుకు మెడి పల్లి పోలీస్ లకుఫిర్యాదు చేయగా.. శ్రీనివాస్ రెడ్డితో పాటుగా తల్లితండ్రిని పోలీసులు అరెస్టు చేసి రిమాండో కు తరలించారు.
ఇంటి ముందు దీక్ష....
తాజాగా ఆదివారం తనకు న్యాయం కావాలని వెళ్లిన సంగీతతో పాటుగా ఆమో కుటుంబసభ్యులపైనా శ్రీనివాస్ రెడ్డి దాడి చేశాడు.దీంతో మెడి పల్లి పోలీసుల స్టేషన్ లో పోలీస్ కేసు నమోదు చేసి విచారణ ఆరంభించారు. సంగీత ఫిర్యాదు మేరకు శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.ఇదిలావుంటే మూడో వివాహాం కూడా వివాదాస్పదం అయ్యింది. తన కూతురును శ్రీనివాస్ రెడ్డి కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్నాడని చెప్పి దేవి తల్లి ఆందొళన కు దిగింది. మైనర్ అయిన తన కూతురు ను వంచించి వివాహం చేసుకున్నాడని ఆమె ఆరోపించింది. ఇక పొతే గతరెండు రొజులుగా శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద ఆందొళనచేస్తున్న సంగీతకు మహిళ సంఘాల నుంచి పెద్ద మొత్తంలో మద్దతు లభించింది .. ఇదిలా వుంటే ఇంటికి తాళాలు వేసి శ్రీనివాస్ రెడ్డి కుటుంబమొత్తం కూడా పారిపోయింది.. సంగీతతోపాటుగా మహిళ సంఘాలు శ్రీనివాస్ రెడ్డి ఇంటి తాళాలను పగుల కొట్టి లోపలికివెళ్లి ఆందొళనకు దిగారు. తనకున్యాయం జరిగే వరకు కూడా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని సంగీతచెప్పింది. ఏది ఏమైనా శ్రీనివాస్ రెడ్డి పోలీసులు అరెస్టు చేసికటాకటాల వెనక్కి నెట్టారు. మరొకవైపు తనకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్న సంగీత కు అధికారులుఎలా న్యాయంచేస్తారొచూడాలి మరి.

