Fri Mar 27 2026 07:21:44 GMT+0530 (India Standard Time)
జేసీ మీసం మెలేశారే

అనంతపురం పార్లమెంటుసభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ ఎంపీలకు సవాల్ విసిరారు. పార్లమెంటు ఎదుట వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోరుతూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఈ సమయంలో అక్కడకు చేరుకున్న జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ ఎంపీలకు మీసం మెలివేశారు. ‘‘మీ వల్ల ఏమీ కాదని, ద్వంద వైఖరిని విడనాడండి’’ అని నినాదాలు చేశారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. సహచర సభ్యులు జేసీకి నచ్చజెప్పి తీసుకెళ్లారు. మంత్రి పదవులు వదులుకోవాల్సి వచ్చిందనే అక్కసుతోనే తమ మీదకు జేసీ వచ్చారని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు.
Next Story

