Tue Mar 24 2026 18:19:46 GMT+0530 (India Standard Time)
జలీల్ భలే జోస్యం చెప్పారే

జనసేనకు వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జోస్యం చెప్పారు. ఇటీవల పవన్ కల్యాణ్ దుర్గగుడి పార్కింగ్ ఫీజుల్లోనూ ఎమ్మెల్యేకు ముడుపులు వెళుతున్నాయని పరోక్షంగా జలీల్ ఖాన్ పై విమ్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో జలీల్ ఖాన్ పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు. పవన్ కు స్థిరత్వం లేదన్నారు జలీల్ ఖాన్. ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రావడం కష్టమేనని చెప్పారు. వైసీపీ ఎంపీలతో పాటు రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేయాలని జలీల్ డిమాండ్ చేశారు.
Next Story

