Sat Apr 04 2026 01:47:13 GMT+0530 (India Standard Time)
జయ వీడియోపై ఈసీ చర్యలకు దిగనుందా?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వీడియో విడుదలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... పాలు తాగుతున్న వీడియోను దినకరన్ వర్గం ఎమ్మెల్యే వట్రివేల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. రేపు పోలింగ్ జరుగుతుండగా ఈ వీడియోనున విడుదల చేయడంపై పూర్తి నివేదికను ఇవ్వాలని ఆర్కే నగర్ ఎన్నిక అధికారులను ఈసీ ఆదేశించింది. దీంతో ఇప్పుడు ఈసీ ఏం నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
- Tags
- జయలలిత
Next Story

