జనసేనలోకి ఆ నేత

జనసేన పార్టీలోకి పాతకాపులూ వచ్చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్తవారికే చోటు కల్పిస్తామని చెప్పారు. యువతరానికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ నేత మాదాసు గంగాధరాన్ని పార్టీలోకి తీసుకున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా మాదాసు గంగాధరం పనిచేశారు. ఆయన మాజీ ఎంపీ, దివంగత మాగుంట సుబ్బారామిరెడ్డి వద్ద పీఏ కూడా కొంతకాలం పనిచేశారు. తర్వాత ఎమ్మెల్సీ గా కూడా ఎన్నికలయ్యారు. ఆయన రాజకీయ సలహాలివ్వడంలో మంచి దిట్టగా పేరుంది.
కీలక బాధ్యతలు.....
దీంతో జనసేనాని ఆయన్ను పార్టీలోకి తీసుకున్నారు. పార్టీలో కీలక బాధ్యతలను మాదాసు గంగాధరానికి అప్పగించారు. అయితే జనసేన ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ద్వారాలను తెరుస్తుందనడానికి మాదాసు గంగాధరమే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. రానున్న కాలంలో మరికొందరు కూడా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే అవకాశముంది. అయితే నిబద్ధత, నిజాయితీ, అంకిత భావంతో పనిచేసే నేతలనే పార్టీలో చేర్చుకుంటానని జనసేనాని గతంలో చెప్పారు.
- Tags
- జనసేన
