Wed Mar 25 2026 11:08:37 GMT+0530 (India Standard Time)
జగన్ సమక్షంలో టీడీపీ నేతలు

వైసీపీలో జోరుగా చేరికలు సాగుతున్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆ పార్టీ అధినేత జగన్ సమక్షంలో టీడీపీ నేతలు వైసీపీలోకి చేరారు. టీడీపీకి సత్తెనపల్లి నియోజకవర్గంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి నిమ్మకాయల ఆదినారాయణ, సత్తెన పల్లి మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావులు జగన్ సమక్షంలో కొద్దిసేపటి క్రితం పార్టీ కండువాలు కప్పుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి స్పీకర్ కోడెల ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Next Story

