Sat Apr 11 2026 05:06:52 GMT+0530 (India Standard Time)
జగన్ షెడ్యూల్ లో మార్పు

వైసీపీ అధినేత జగన్ తిరుమల బయలుదేరి వెళ్లారు. సీబీఐ కోర్టులో ఆలస్యం కావడంతో జగన్ రాత్రి 7గంటలకు జగన్ తిరుమలకు బయలుదేరారు. రాత్రికి తిరుపతికి చేరుకునే జగన్ అక్కడి నుంచి నేరుగా కారులో తిరుమల చేరుకుంటారు. వాస్తవానికి కాలినడకన శ్రీవారిని దర్శించుకోవాలని జగన్ భావించారు. కాని కోర్టులో ఎక్కువ సమయం ఉండాల్సి రావడంతో ఆయన షెడ్యూల్ లో మార్పు చోటు చేసుకుంది. కారులోనే తిరుమల వెళ్లి ఈరోజు రాత్రికి అక్కడే బస చేయనున్నారు. రేపు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన కడప బయలుదేరి వెళతారు.
- Tags
- జగన్
Next Story

