జగన్ యాత్ర విజయవంతం కావాలంటున్న స్టార్ హీరో ...!

తమిళ హీరో అయినా తెలుగునాట సూర్య కు వున్న ఫాలోయింగ్ బాగా ఎక్కువే. ఆయన నటించిన అనేక విజయవంతమైన చిత్రాలు తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కూడా. అలాంటి హీరో సూర్య వైసిపి అధినేత వైఎస్ జగన్ కి మద్దత్తుగా నిలిచారు. నిలవడమే కాదు జగన్ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్ర పేరిట ప్రజల కష్టాలు నేరుగా వెళ్ళి తెలుసుకోవడానికి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టడాన్ని ఒక మంచి పరిణామమని ఒక నాయకుడి గొప్పతనమని చెప్పుకొచ్చారు.
హీరో సూర్య... జగన్ స్నేహితులు ...
తమిళ హీరో సూర్యా, వైఎస్ జగన్ మంచి స్నేహితులు. కాలేజీ రోజుల్లోనే వారిద్దరూ కలిసి మెలిసి ఉండేవారు. వైఎస్ కుటుంబంతో కూడా సూర్య కు అనుబంధం వుంది. ఈ నేపథ్యంలోనే తన మిత్రుడు చేస్తున్న పాదయాత్రకు అండగా నిలిచారు సూర్యా. జగన్ శుభాకాంక్షలు తెలియచేసారు. ఆయన పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ ప్రజల సమస్యలపట్ల జగన్ రెడ్డి కి మంచి అవగాహన ఉందని కళాశాల రోజులనుంచి తమ మధ్య వున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు సూర్య. తెలుగు రాష్ట్రాల్లో సినీహీరో లంతా అటు కేసీఆర్ ఇటు చంద్రబాబు లకు మద్దతు ప్రకటించేస్తున్నారు. రెండు పార్టీలు అధికారంలో ఉండటంతో సినీ వ్యాపారాల దృష్ట్యా ఈ పరిస్థితి వారికి తప్పడం లేదు. ఈ నేపథ్యంలో సూర్య లాంటి స్టార్ హీరో వైసిపి అధినేతకు మద్దతుగా చేసిన ప్రకటన ఆ పార్టీ వర్గాల్లో బాగా జోష్ నిచ్చింది.
- Tags
- జగన్

