జగన్ మొండోడేనబ్బా...!

వైసీపీ అధినేత జగన్ మళ్లీ పాదయాత్ర ప్రారంభించనున్నారు. నిన్న సీబీఐ కోర్టుకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వెళ్లిన జగన్ రాత్రికే ఆళ్లగడ్డ మండలానికి చేరుకున్నారు. రోడ్డు మార్గం ద్వారా వచ్చిన జగన్ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. శుక్రవారం వస్తేనే వైసీపీ నేతలు భయపడిపోతున్నారు. గురువారం రాత్రికి హైదరాబాద్ బయలుదేరడం, కోర్టులో ఆరుగంటల పాటు ఉండటం, తిరిగి రోడ్డు మార్గం ద్వారా పాదయాత్రకు విరామమిచ్చిన స్థలానికి చేరుకోవడం జగన్ కు ఇబ్బందిగా మారింది. ఆయన రెస్ట్ లేకుండా తిరగాల్సి వస్తుందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. విశ్రాంతి లేకపోవడంతో ఆయన స్వల్ప అనారోగ్యానికి కూడా ఇటీవల గురయ్యారంటున్నారు. వందల కిలోమీటర్లు ప్రయాణించడం వెంటనే పాదయాత్ర ప్రారంభించాల్సి ఉండటంతో ఆయన ఆరోగ్యం ఎక్కడ దెబ్బతింటుందోనన్న ఆందోళన వైసీపీ నేతల్లో వ్యక్తమవుతుంది. అయినా జగన్ మొండి ఘటమని ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సత్తా జగన్ కు ఉందని చెబుతున్నారు వైసీపీ నేతలు.
ఫ్రైడే వస్తే టెన్షనే.....
శనివారం వైసీపీ అధ్యక్షుడు జగన్ 11వ రోజు పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆళ్లగడ్డ మండలంలోని దొర్నిపూడి నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. కొలవకుంట్ల మండలంలోని కంపమల్ల మెట్ట కు చేరుకుంటారు. ఈరోజు ఆయన యాత్ర ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ముగిసి బనగానపల్లె నియోజకవర్గంలో ప్రారంభమవుతుంది. జగన్ ప్రజాసంకల్పయాత్ర ఉయ్యాలవాడ క్రాస్ రోడ్స్ మీదుగా భీముని పాడుకు చేరుకుంటుంది. అక్కడ పార్టీ జెండాను జగన్ ఆవిష్కరిస్తారు. తర్ాత పెరా బిల్డింగ్స్, కోవెలకుంట్ల కు చేరుకుంటారు. కోవెల కుంట్లలో ఈరోజు రాత్రి జగన్ బస చేస్తారు. శుక్రవారం వచ్చిందంటే వైసీపీ నేతలు జగన్ ఆరోగ్య పరిస్థతిపై టెన్షన్ పడాల్సి వస్తోంది.
- Tags
- జగన్

