Thu Mar 26 2026 19:00:02 GMT+0530 (India Standard Time)
జగన్ మాకు రహస్య మిత్రుడు కాడు

వైసీపీ అథ్యక్షుడు జగన్ తో తమకు రహస్య ఒప్పందాలేమీ లేవని బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు తెలిపారు. ప్రత్యేకహోదాపై ఏపీ శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ జగన్ తో సంబంధాలు పెట్టుకోబట్టే ఏపీకి న్యాయం చేయకుండా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి బీజేపీ నెడుతుందని కొందరు చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. ప్రత్యేక హోదా అంటే తెలియని వాళ్లు కూడా ఇలాంటి విమర్శలు చేస్తారన్నారు. హోదా వల్ల రాయితీలు రావని, అది తెలుసుకుని మాట్లాడితేనే మంచిదన్నారు.
- Tags
- జగన్
Next Story

