జగన్ పై మళ్ళీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసిన టిడిపి ...?

మైండ్ గేమ్ తో రాజకీయాలు విజయవంతంగా నడపడంలో దేశంలోనే టిడిపి ది ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. మిత్రపక్షం బిజేపితోను విపక్షం వైసిపితోను మైండ్ గేమ్ చక్కగా ఆడుతుంది టిడిపి. దీనిని తిప్పి కొట్టడంలో ఆ రెండు పార్టీలు విఫలం అవుతున్నాయనే చెప్పాలి . తాజాగా వైసిపి అధినేత వైఎస్ జగన్ యువభేరి సభ నిర్వహించారు . ఆయన ఇలా సభ పెట్టారో లేదో మంత్రులు నారా లోకేష్ , ప్రత్తిపాటి పుల్లారావు , కాల్వ శ్రీనివాసులు తెరపైకి వచ్చేశారు . చంద్రబాబు అయితే కేబినెట్ భేటీలో మాట్లాడుతూ , జగన్ పై ఎంపీలు ఎందుకు రాజీనామా చేయలేదో చెప్పాలని వ్యాఖ్యానించారు.
జగన్ ప్రశ్నలకు టిడిపి నేతల జవాబులకు పొంతనే లేదే ..?
యువభేరిలో జగన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదా పై దగా చేశాయన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పరిశ్రమలు రావాలి అంటే హోదా కావాలి అన్నారు. ఎన్నికలకు ముందు టిడిపి బిజెపి చేసిన వాగ్దానాలు ఏమిటి ? గెలిచాకా వారు చేసింది ఏమిటి అంటూ నిలదీశారు. ఈ అంశాలను పక్కదారి పట్టించేలా మంత్రులు ఇతర అంశాలు ప్రస్తావించారు . జగన్ ఆస్తులు చెప్పాలని తన ఆస్తులు ప్రకటిస్తా అని బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. జగన్ ప్రస్తావించిన అంశానికి లోకేష్ ప్రతిస్పందించిన దానికి సంబంధమే లేదు.
మిగిలిన వారు అంతే ...
ఇక మంత్రి కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యలు అదే విధంగా వున్నాయి . కేంద్రంపై వత్తిడి పెంచాలని జగన్ వ్యాఖ్యానిస్తే వైసిపి అధినేత కేసుల అంశాన్ని శ్రీనివాసులు ప్రస్తావించారు. ఇక కొద్దొగొప్పో మంత్రి ప్రత్తిపాటి మాత్రమే యువభేరి సభ కు ప్రతిస్పందన కొంత అటు ఇటుగా వ్యాఖ్యానించారు . హోదా లేకపోయినా అప్పుడు ఇప్పుడు చంద్రబాబు విజన్ తోనే రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు వచ్చాయని అన్నారు . ఇలా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్య అంశాలపైనా టిడిపి తన మైండ్ గేమ్ అస్త్రంతో టాపిక్ ను డైవర్ట్ చేయడంలో పూర్తిగా నిమగ్నం అయ్యిందే కానీ హోదా కాకుండా ప్యాకేజి ఎలా ఆదానో మాత్రం చెప్పుకోలేక పోతుంది.

