జగన్ పార్టీకి ఈ కష్టమంటూ లేకపోతే?

జగన్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? సీబీఐ కేసులతో ఉన్న జగన్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎదుర్కొంటుండంతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వారే సొంత ఖర్చులు భరించాలన్నది వైసీపీ అధినేత ఆలోచన. ఈ విషయాన్ని కొందరు సీనియర్ నేతలకు కూడా చెప్పేశారు. పార్టీ ఆర్థికంగా కష్టాల్లో ఉన్నందున అభ్యర్థులు ఎవరైనా తమకు తామే ఎన్నికల ఖర్చును భరించాల్సి ఉంటుంది. ఈ మేరకు సంకేతాలను కూడా ఇచ్చారు. అయితే వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. అధికారంలో లేకపోవడం.... తామున్న నియోజకవర్గాలకు టీడీపీ ఇన్ ఛార్జులుగానే నియమించడంతో అంతా వారు చెప్పినట్లే నడుస్తుంది. నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలకు పనులేవీ జరగడం లేదు. మరొక వైపు క్యాడర్ ను కాపాడుకోవాల్సిన పరిస్థితి. పార్టీ కార్యక్రమాలను చేయాల్సిన స్థితి. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్యే పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలోనూ ఇదే విషయాన్ని చెప్పడంతో కొందరు మానసిక ఆందోళనకు గురయినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ బుట్టా రేణుక కూడా ఈ మాట విన్న తర్వాతనే పార్టీని వీడాలన్న నిర్ణయానికి వచ్చారు.
పాదయాత్రకు.... దాదాపు పదికోట్లు.....
ఇక జగన్ పాదయాత్రకు రోజుకు ఐదు లక్షల వరకూ ఖర్చవుతుందని అంచనా. ఈ మేరకు ఆరు నెలల పాటు పాదయాత్ర జరగాలంటే దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. పాదయాత్ర కేవలం 125 శాసనసభ నియోజకవర్గాల్లోనే జరుగుతుంది. పాదయాత్రకు తన వెంట వచ్చే వారికి భోజనసదుపాయాలు, సిబ్బంది ఖర్చులు, మీడియా ప్రతినిధులకు వసతి వంటి ఏర్పాట్లు అన్ని పార్టీయే చూసుకోవాల్సి ఉంటుంది. దీన్ని భరించాలంటేనే పార్టీకి కష్టంగా మారిందని వైసీపీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. జగన్ యువభేరి కార్యక్రమం పెడితే కనీసం పదిలక్షల రూపాయలు ఖర్చవుతుందని, అందుకే ఇన్ని రోజుల యువభేరి లాంటి కార్యక్రమాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందంటున్నారు. మొత్తం మీద జగన్ పార్టీ ఆర్థికంగా కష్టాల్లో ఉన్నట్లు ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. అయితే ఎన్నికల సమయం ఇంకా ఏడాదిన్న ఉండటంతో పార్టీకి విరాళాలు ఇప్పటి నుంచే సేకరించాలన్న యోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాకు పంపి విరాళాలు సేకరించేందుకు కొందరుముఖ్య నేతలను ఎంపిక చేశారు. కూడావచ్చే ఎన్నికలకు అభ్యర్ధులు ఖర్చు మొత్తం తామే భరించాల్సి రావడంతో పార్టీలో కొంత అయోయమం నెలకొన్న మాట వాస్తవం. మరి జగన్ ఈ సమస్య నుంచి ఎలా బయటపడతారో చూడాలి.
- Tags
- జగన్ పార్టీ

