Sat Apr 04 2026 03:11:47 GMT+0530 (India Standard Time)
జగన్ నేడు ఇక్కడ.....!

వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్ర ప్రారంభించి నేటికి 40 రోజులవుతుంది. మధ్యలో శుక్రవారాలు విరామమిచ్చిన తరుణంలో నేడు యాత్ర 40వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఉదయం అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలం వెంకటాపురం క్రాస్ రోడ్స్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం చిలకలగడ్డపల్లి కొట్టాలుకుచేరుకుంటారు. తర్వాత నాయనవారి పల్లి క్రాస్ రోడ్డస్, నల్లమాడ మండలం బాపనకుంట, నీరాల వంక తండా క్రాస్ రోడ్స్, రెడ్డిపల్లి వరకూ పాదయాత్ర చేస్తారు. అనంతరం మధ్యాహ్నం ఆర్.రామాపురం వద్ద భోజన విరామానికి ఆగుతారు. తర్వాత నల్లసింగయ్య గారిపల్లి, నల్లమాడ క్రాస్ రోడ్స్ వరకూ నేడు జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. ఈరోజు కూడా జగన్ పాదయాత్ర పుట్టపర్తి నియోజకవర్గంలోనే పర్యటించనున్నారు.
- Tags
- జగన్
Next Story

