Sat Apr 11 2026 06:30:50 GMT+0530 (India Standard Time)
జగన్ తో లగడపాటి భేటీ ఎందుకంటే?

వైసీపీ అధినేత జగన్ ను మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కలిశారు. దాదాపు అరగంట సేపు వీరి భేటీ జరిగింది. లగడపాటి రాజగోపాల్ కుమారుడి వివాహం ఈ నెల25వ తేదీన హైదరాబాద్ లో జరగనుంది. తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకే లగడపాటి జగన్ ను కలిసినట్లు తెలుస్తోంది. పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేసిన లగడపాటి పాదయాత్రపై కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది. పలు రాజకీయ విషయాలపై కూడా వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం.
- Tags
- లగడపాటి
Next Story

