Sat Mar 28 2026 11:31:05 GMT+0530 (India Standard Time)
జగన్ చేతికి గాయమైందే

వైసీపీ అధినేత జగన్ చేతి వేళ్లకు గాయాలయ్యాయి. గత నాలుగు నెలలుగా ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్న జగన్ అందరినీ పలుకరించుకుంటూ, అందరితో చేతులు కలుపుతూ ముందుకెళుతున్నారు. అయితే ఆయన ప్రస్తుతం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కనిగిరి నియోజకవర్గంలో చేతి వేళ్లకు గాయాలు తీవ్రం కావడంతో వైద్యులు పరీక్షలు చేసి బ్యాండేజి కట్టారు. అయితే ఎక్కువ మందితో కరచాలనం చేస్తుండటం వల్లనే ఈ గాయాలయ్యుంటాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.
- Tags
- జగన్
Next Story

