Mon Apr 13 2026 12:14:06 GMT+0530 (India Standard Time)
జగన్ కోర్టులో పిటీషన్ ఏం వేశారంటే?

తాను నవంబర్ 2వ తేదీ నుంచి పాదయాత్ర చేపడుతున్నానని, అందుకు ప్రతిశుక్రవారం తనను కోర్టు హాజరు నుంచి మినహాయించాలని వైసీపీ అధినేత జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. నవంబర్ రెండో తేదీ నుంచి ఆరు నెలల పాటు పాదయాత్ర చేపడుతున్నందున, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాలంటే కష్టమని సీబీఐ కోర్టులో జగన్ తన పిటీషన్ ను దాఖలు చేశారు. తనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇస్తే పాదయాత్ర సజావుగా జరుగుతుందని, అందుకు అనుమతించాలని కోరారు. ఈ పిటిషన్ పై విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేశారు.
- Tags
- జగన్
Next Story

