Sat Mar 28 2026 18:32:21 GMT+0530 (India Standard Time)
జగన్ కు సోమిరెడ్డి వార్నింగ్....!

జగన్ దురాశకు 12 మంది ఐఏఎస్ లు కేసుల్లో చిక్కుకున్నారని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైరయ్యారు. దేశంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని జగన్ కోట్లు దోచుకున్నారని చెప్పారు. ఇప్పుడేమో ఐఏఎస్ లపై జగన్ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. జగన్ తీరుమార్చుకోవాలని సోమిరెడ్డి హెచ్చరించారు. నీతి అయోగ్ నిబంధనల కారణంగానే ఆరోజు ప్రత్యేక ప్యాకేజీకి విధిలేని పరిస్థితుల్లో అంగీకరించామని చెప్పారు. ఇప్పుడు 11 రాష్ట్రాలకు ప్రత్యేకహోదా పొడిగించినందున ఏపీకి కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పొడిగించినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు హోదా ఎందుకు ఇవ్వడం లేదన్నారు.
- Tags
- సోమిరెడ్డి
Next Story

