జంపన్నకు షాక్ ఇచ్చిన మావోయిస్టు పార్టీ

ఉహించని రీతిలో జంపన్నకు షాక్ ఇచ్చింది మావోయిస్టు పార్టీ.. పార్టీకి నష్టం చేసిన జంపన్నను ద్రోహిగా మావొయిస్టు కేంద్ర నాయకత్వం ప్రకటించింది.. మావొయిస్టు పార్టీ అగ్రనాయకత్వం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మావొయిస్టు పార్టీ అధికారప్రతినిధి అభయ్ పేరుతో వచ్చిన ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తవించింది.. గత ఏడాది కాలం నుంచి కూడా జంపన్న ను పార్టీకీ దూరం పెట్టాం. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నందున ఏడాది క్రితమే జంపన్నను సస్పెండ్ చేసి దూరం పెట్టామని ప్రకటించింది. పార్టీని నష్టపరిచే విధంగా జంపన్న వ్యవహారించాడు. పోలీసుల ముందు లొంగిపొయే సమయంలో జంపన్న తప్పుడు ప్రకటనలు చేశాడని అభయ్ తెలిపాడు. అంతేగాకుండా పార్టీకీ సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను బయటి లీక్అయ్యాయన్నారు..అంతేగాకుండా పార్టీలోజంపన్న సస్పెండ్ చేయడంతో కొత్త సిద్ధాంతాన్ని వెలుగులోకి తెచ్చాడు. సైద్ధాంతికం పేరుతో పార్టీలో చర్చ పెట్టాడు.తమ పార్టీలో సిద్ధాంతం మీద ఎప్పడు చర్చలు జరుగుతునే వుంటాయి.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీలో ఎప్పడూ చర్చలు జరుపుతునే వున్నాం.. దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పాడు.అలాగే పార్టీలోపూర్తి స్దాయిలో భావ ప్రకటన స్వేచ్చ వుందని తెలిపాడు. పార్టీని నష్ట పరిచే విధంగా వ్యవహారించిన జంపన్నను ఒక ద్రోహిగా మావొయిస్టు పార్టీప్రకటించింది. అయితే లొంగిపోయిన ఒక నేత గురించి ఇంత పెద్ద స్టేట్ మెంట్ ను ఎప్పడు కూడా మావోయిస్టుపార్టీ ఇవ్వలేదు. అయితే జంపన్న లొంగుబాటును పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది.
- Tags
- జంపన్న

