జంక్షన్లో జెండాలా... టిడిపి...!

పార్లమెంట్ వేదికగా రోడ్డెక్కిన తమ్ముళ్లు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నారు. విభజన హామీలు, బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై తీవ్ర స్థాయిలో గళం ఎత్తిన తెలుగుదేశం ఇప్పడూ కేంద్రం జరుపుతున్న చర్చలు తాజాగా ఇస్తున్న హామీలకు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లలేక వెనక్కి రాలేక అయోమయంలో పడింది. కేంద్రాన్ని కాదని ముందుకు వెళితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొవాలిసి ఉంటుందో అన్న ఆందోళన టిడిపి వర్గాలను వేధిస్తుంది. అలా అని కీలకమైన ఈ సమయంలో మిన్నకుంటే విపక్ష పార్టీ అడ్వాంటేజ్ తీసుకునే ప్రమాదం ఉందని శంకిస్తుంది. దాంతో ఎటు పాలుపోక టిడిపి మేధో వర్గం భవిష్య కార్యాచరణపై కసరత్తు ముమ్మరం చేసింది.
టిడిపి వెనక్కి రాకపోతే ...
ఏపీలో ఇంకా ఏడాదికి పైగా అధికారంలో కొనసాగాలిసి వుంది. ఈ దశలో కేంద్రంతో తగాదా పెట్టుకుంటే రాజకీయంగా పార్టీని ఇబ్బంది పెట్టే చర్యలకు మోడీ సర్కార్ సంకల్పిస్తే ఏంటన్నది టిడిపిని వేధిస్తుంది. అలాంటి చర్యలకు దిగడంలో నరేంద్ర మోడీ, అమిత్ షా లు ఇద్దరు దిట్టలు. వారిద్దరూ బీజేపీయేతరులు అధికారంలో వున్న రాష్ట్రాల్లో అమలు చేస్తున్న వ్యూహాలు ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్నాయి. ఆ భయమే టిడిపి పార్టీని వెంటాడుతుంది. అందుకు ప్రతి వ్యూహాన్ని పటిష్టంగా రూపొందించుకునే ప్రజల్లో మైలేజ్ తగ్గకుండా చర్యలు తీసుకోవాలని పసుపు దళం మేధో మధనం చేస్తుంది.
- Tags
- టీడీపీ

