చైతు గోవా పెళ్లి ఖర్చు పదికోట్లు ...?

గొప్పింటి వారి పెళ్ళిళ్ళు అందులోను సెలబ్రెటీ ల పెళ్ళిళ్ళు ఒక రేంజ్ లో ఉంటాయి . అందుకే వారి పెళ్ళి విశేషాలు తెలుసుకునేందుకు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తారు. మీడియా వెంటబడుతుంది. పెళ్ళి చేసుకునే కుటుంబానికి ప్రైవసీ దూరం అవుతుంది. ఈ నేపథ్యంలోనే సుదూర ప్రాంతాల్లో తాము తమ బంధువులు, సన్నిహితులు మాత్రమే ఉండేలా ఇటీవల కాలంలో సెలబ్రెటీలు జరుపుకునే శుభకార్యాలు ఉంటున్నాయి. నాగచైతన్య , సమంతల వివాహం గోవాలో జరిగేలా అక్కినేని నాగార్జున డిజైన్ చేశారు. డబ్ల్యు అనే అత్యంత విలాసవంతమైన స్టార్ హోటల్ వీరి పెళ్ళికి ఆతిధ్యం అందిస్తుంది. అందుకోసం దాదాపుగా 10 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారట నాగార్జున. వాస్తవానికి అమ్మాయి తరుపు వారే పెళ్లి ఖర్చు భరించాలిసి వున్నా నాగార్జున అధికభాగం ఖర్చును తన జేబునుంచే ఖర్చు చేసేయడం విశేషం.
విఐపిల కోసం రిసెప్షన్ హైదరాబాద్ లో ....
ప్రస్తుతం నాగచైతన్య , సమంతల లు రెండు మతాచారాల ప్రకారం పెళ్లి చేసుకుంటున్నారు. అందువల్ల హీరో హీరోయిన్ కుటుంబాలకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చి బంధు మిత్రులు తో సరదాగా ఉండేలా నాగ్ ప్లాన్ చేశారు . తెలుగు రాష్ట్రాల్లో సినీప్రముఖులు ,విఐపి లు పారిశ్రామికవేత్తలు తనకు అత్యంత సన్నిహితంగా వుండే వారికోసం మరో భారీ రిసెప్షన్ ఇవ్వబోతున్నారు నాగార్జున . మరి దీనికి ఎంత బడ్జెట్ కేటాయించారో చూడాలి .

