చేపా..చేపా..నీ.. ఖరీదు రూ.445 కోట్లా?

హైదరాబాద్ లో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. కిసాన్ క్రెడిట్ కార్డుల రుణాల్లో ఈ స్కామ్ జరిగింది. ఈసారి ఏకంగా బ్యాంకు ఉద్యొగినే ఈ స్కామ్ కు తెరలేపాడు. తనకు ఇష్టం వచ్చిన వారికి రుణాలు మంజురు చేసి పెద్ద మొత్తంలో ఆస్తులను కూడ బెట్టాడు. ఇండిస్టియల్ డెవలప్ మెంట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ( ఐడిబిఐ) లో కీలకమైన పోస్టులో పనిచేస్తున్న ఉన్నతాధికారి ఈ స్కామ్ చేసినట్లుగా సిబిఐ గుర్తించింది. ఐడిబిఐ ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐడిబిఐ జనరల్ మెనేజర్ తో పాటుగా 41 మంది ఖాతాదారులపైన సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ స్కామ్ మొత్తం విలువ 445 కొట్లుగా సిబిఐ అంచనా వేసింది.
ఏపీలోనే ఎక్కువగా...
హైదరబాద్ కేంద్రంగా జరిగిన ఈ స్కామ్ లో విశాఖపట్నం. గుంటూరు, ప్రకాశం, ఆదిలాబాద్ జిల్లాలోనే ఎక్కువగా రుణ గ్రహీతలు వున్నారు. వీరందరిపైనా సిబిఐ ఇప్పడు కేసులు పెట్టి విచారణ చేస్తుంది. ఇందులో 41 మంది పారిశ్రామిక వేత్తలు వున్నారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఎమిటంటే. ఉభయ గొదావరి జిల్లాలో చేపల పెంపకం చేస్తున్నామని 41 మంది పారిశ్రామిక వేత్తలు రుణాలు తీసుకున్నారు. అయితే ఐడిబిఐ జనరల్ మెనేజర్ గా వున్న రామరావు ఎలాంటి తనీఖీలు చేయించకుండానే వీరికి రుణాలు ఇచ్చాడు. ఇందుకు గాను తన కింద పనిచేస్తున్న అధికారులను కూడా ఉపయోగించుకున్నాడు. ఇలా హైదరాబాద్ , ఆదిలాబాద్,. గుంటురు. ప్రకాశం. విశాఖపట్నంలో చేపల చేరువుల కోసం 2012 దాకా వీరు రుణాలు తీసుకున్నారు.
కరెంట్ అకౌంట్ నుంచి మళ్లించి....
కరెంట్ అకౌంట్ లో జమ అయిన డబ్బులన్నింటినీ ఈ 41 మంది పారిశ్రామిక వేత్తలు వాటిని సేవింగ్ అకౌంట్స్ లోకి మళ్లించుకుని డ్రా చేసుకున్నారు. వీటిని ఏమీ గుర్తించ కుండానే రామరావు 41 మందికి రుణాలు ఇచ్చారు. అయితే ఈ రుణాలన్ని కూడా తిరిగి రావని చెప్పి పై అధికారులకు రిపోర్టు కూడా ఇచ్చాడు రామరావు. అయితే ఇటీవల కాలంలో వెలుగు చూసిన బ్యాంకు స్కామ్ ల నేపధ్యంలో ఐడిబిఐ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేశారు. బ్యాంకు అధికారుల ప్రమేయంతోనే ఈ స్కామ్ జరిగిందని గుర్తించి సిబిఐకి బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఏదో సినిమా తరహాలో వీరు బ్యాంకు రుణాలు తీసుకుని వాటిని ఎగవేసినట్లుగా తెలుస్తుంది.
