Wed Mar 25 2026 03:06:18 GMT+0530 (India Standard Time)
చెలరేగిపోతున్న సోము వీర్రాజు

చంద్రబాబు నాయుడు మోడీని టార్గెట్ చేసుకుంటే.... బీజేపీ నేత సోము వీర్రాజు చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ ఏజెంట్ గా అభివర్ణించారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో లోపాయి కారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని సోము వీర్రాజు తెలిపారు. చంద్రబాబు ప్రస్తుతం పూర్తి నిరాశ, నిస్పృహలతో ఉన్నారని, అందుకే మోడీపై తిరగబడాలని పిలుపునిస్తున్నారన్నారు వీర్రాజు. అంతేకాదు చంద్రబాబు రాయలసీమకు చేసిందేమీ లేదని, రాయలసీమ వాసులు చంద్రబాబుపై తిరగబడాలని పిలుపునిచ్చారు.
Next Story

