చెన్నైలో తెలుగు విద్యార్థిని ఆత్మహత్య

చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో సీఎస్ఈ చదువుతోన్న విద్యార్థిని రాగ మౌనిక అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్నల్ పరీక్షల్లో మౌనిక చూసి రాస్తుందని కారణంతో ఇన్విజిలేటర్లు ఆమెను బయటికి పంపించి వేశారు. అంతేకాక భవిష్యత్ లో జరిగే పరీక్షలకు కూడా అనుమతించబోమనేసరికి మనస్తాపానికి గురైన మౌనిక హాస్టల్ గదిలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చివరిగా తన మిత్రులందరికి లవ్ యూ ఆల్ మిస్ ఆల్ అని మెసేజ్ పెట్టింది. ఇది చూసి కోపం పట్టలేక పోయిన సహచర విద్యార్థులు కాలేజీ యాజమాన్య తీరు వల్లే రాధా ఆత్మహత్యకు పాల్పడిందనే బాధతో కాలేజీ ఫర్నిచర్ కు నిప్పు పెట్టారు. మంటలు తీవ్రతరం కావడంతో సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కళాశాల యాజమాన్యం కళాశాలకు సెలవు ప్రకటించింది. రాగ మౌనిక హైదరాబాద్ కు చెందిన వారు కావడంతో బంధువులు హుటాహుటిన చెన్నై తరలి వచ్చారు.

