చిరంజీవి సన్నిహితులమంటూ చెప్పి...13 లక్షలకు టోకరా...!

తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటులు చిరంజీవి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మేము ఉండాల్సిందే అంటూ ప్రచారం చేసుకుంటూ అమాయకులపై వలవేసి ఉచ్చులోకి లాగారు. అలా వారి చేతిలో చిక్కి ఉన్నదంతా పోగొట్టుకున్న తరువాత మోసపోయినట్టు గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతున్నారు . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బహదూర్‌పూరా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ బాగ్ కు చెందిన తారిక్,సల్మాన్ లు స్నేహితులు వీరు కిషన్ బాగ్ లో జే7 స్టూడియో పేరుతో ఓ దుకాణం తెరిచి జే7 పేరుతో లెటర్ హెడ్స్ తాయారు చెసీ వాటిని రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలలోని తమకు పరిచయస్తులకు చేరేవిధంగా చేజవారు . వాటి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన అనేక మందికి తాము ప్రముఖ నటులు చిరంజీవి అత్యంత సన్నిహితులని వారికి ఎక్కడ ఏదైనా తాము మాత్రమే అందజేస్తున్తామని ప్రచారం చేసుకున్నారు. వారి మాయ మాటలు నమ్మిన కృష్ణాజిల్లా మైలవరం ప్రాంతానికి చెందిన రాంబాబు , అతని కూతురు సాయి స్వరుపలతో పాటు పఠాన్ రాబ్బాని , సాహిద్ పఠాన్లు వారి వలలో పడ్డారు. ప్రపంచంలో ఎక్కాడైనా ఉద్యోగాలు కల్పిస్తామనే ధీమాను వ్యక్తం చేసారు . వారి మాటలను నమ్మిన నలుగురు బాదితులు సల్మాన్ . తారిక్ లకు సుమారు 13లక్షలకు పైగా నగదును అందించారు. అరేబియన్ దీవుల్లోని ఓ రెస్టారెంట్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పిన నిందితులు బాధితులను విజయవాడ నుండి ఢిల్లీ విమానాశ్రయానికి తీసుకెళ్ళారు. అక్కడినుండి చాకచక్యంగా నిందితులు తప్పించుకొని వెళ్ళిపోయారు. మోసపోయిన విషయాన్ని గ్రహించిన బాదితులు కిషన్ బాగ్ లోని జే 7 స్టూడియో ఆచూకీ తెలుసుకొని బహదూర్‌పూరా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు . మోసపోయిన విషయాన్ని పోలీస్ లకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంబించిన బహదూర్‌పూరా పోలీసులు

