చిన్నమ్మను చూడటానికీ ఇష్టపడలేదే

తమిళనాడు రాజకీయాలు చాలా సీరియస్ గా ఉంటాయి. ఒకసారి వదిలించుకుంటే ఇక కౌగిలించుకునేది ఉండదు. జయలలిత, కరుణానిధిల వార్ అలానే ఉండేది. ఎవరు అధికారంలో ఉంటే ప్రత్యర్థిగా ఉన్న వారిని ముప్పుతిప్పలు పెడతారు. కొన్నాళ్లుగా కరుణానిధి, జయలలిత అదే సంప్రదయాన్ని తమిళనాడులో కొనసాగించారు. శుభకార్యాలకు, చెడు కార్యక్రమాలకూ హాజరు కారు. అంత కఠినంగా ఉంటారు అక్కడి పొలిటీషియన్స్. వ్యక్తిగత ద్వేషాలతో ఒకరినొకరు కేసులు పెట్టుకున్న సంఘటనలు కూడా కోకొలల్లు. రాజకీయంగా చూడరు. వ్యక్తిగతంగానే కక్షలు తీసుకునే రకం. ఇలాంటి కక్ష పూరిత సంఘటనలు అనేకం గతంలో తమిళనాడులో చోటుచేసుకున్నాయి.
శశికళ బాధలో ఉన్నా....
అయితే నటరాజన్ మృతి బాధాకరమే. నటరాజన్ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వద్ద పీఆర్వోగా పనిచేశారు. తర్వాత నటరాజన్ భార్య శశికళ జయను దాదాపు మూడు దశాబ్దాల పాటు కంటికి రెప్పలా చూసుకున్నారు. జయను విడిచి ఎక్కడకు వెళ్లలేదు. చివరకు భర్తను కూడా జయ కోసం దూరం చేసుకున్నారు శశికళ. ఈ పరిస్థితుల్లో శశికళ భర్త నటరాజన్ మృతిచెందారు. అయితే నటరాజన్ ను చూసేందుకు అన్నాడీఎంకే కు చెందిన ఏ ఒక్క వ్యక్తి రాలేదు. శశికళను పరామర్శించే వారూ కరువయ్యారు. బంధువులు, సన్నిహితుల సమక్షంలోనే నటరాజన్ అంత్యక్రియలు ముగిశాయి. కనీసం అధికార పార్టీ నుంచి సంతాప ప్రకటనా రాలేదు.
అమ్మ ద్రోహులంటున్న అన్నాడీఎంకే....
అయితే ఈ కార్యక్రమానికి అన్నాడీఎంకే నేతలు ఎవరూ రాలేదు. దీంతో అక్కడ దినకరన్ వర్గానికి చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేతలు, కార్యకర్తలే ఉన్నారు. వారు ద్రోహులని కనీసం పార్టీకి దశబ్దాలపాటు సేవలందించిన కుటుంబం బాధల్లో ఉంటే పరామర్శ చేయడానికి కూడా ఇష్టపడటం లేదని దినకరన్ వర్గీయులు ఆరోపించారు. అయితే దీనిపై మంత్రి జయకుమార్ ఘాటుగా స్పందించారు. వారు అమ్మ ద్రోహులని, తమకు వారితో ఎలాంటి సంబంధాలు లేవని, పార్టీ నుంచి బహిష్కరించినప్పుడే వారితో సంబంధాలు తెగిపోయాయని చెప్పడం విశేషం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.... శశికళకు పదిహేను రోజుల పాటు పెరోల్ మంజూరయ్యేదుకు అవసరమైన సాక్షి సంతకాన్ని అన్నడీఎంకే పార్లమెంటు సభ్యుడు పెట్టాడన్న వార్తలు గుప్పుమంటున్నాయి.
- Tags
- శశికళ
