Fri Mar 27 2026 10:27:10 GMT+0530 (India Standard Time)
చిక్కుల్లో చింతమనేని

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చిక్కుల్లో పడ్డారు. మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ పై దాడి, ఆయన గన్ మెన్ పై దాడి కేసుల్లో చింతమనేనికి భీమడోలు రెండేళ్లు జైలుశిక్షను విధించిన సంగతి తెలిసిందే. అయితే భీమడోలు కోర్టు విధించిన కేసుపై ఎమ్మెల్యే చింతమనేని ఏలూరు కోర్టును ఆశ్రయించారు. భీమడోలు కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరుతూ వేసిన పిటీషన్ ను కోర్టు తోసిపుచ్చింది. అయితే ఈ కేసుపై అప్పీల్ కు మాత్రం అనుమతిచ్చింది. ఈ శిక్ష ఖరారయితే చింతమనేనిపై అనర్హత వేటు పడుతుందని చెబుతున్నారు. ఇప్పటికే చింతమనేనిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ నేతలు స్పీకర్ ను కోరారు.
- Tags
- చింతమనేని
Next Story

