చక్రబంధంలో భాగ్యనగరం ....

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా రాక. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ పారిశ్రామిక వేత్తలు భాగ్యనగరం వస్తున్న నేపథ్యంలో డేగ కళ్లతో నిఘా వ్యవస్థ పనిచేయడం మొదలు పెట్టింది. హైదరాబాద్ లో జరిగే ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్, నగరవాసుల చిరకాల కోరిక మెట్రో రైల్ ప్రారంభ కార్యక్రమాలతో నగరంలో అనేక చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ప్రముఖులు పర్యటిస్తారని భావిస్తున్న ప్రాంతాల్లో ఇప్పటికే డాగ్ స్క్వాడ్ బాంబ్ స్క్వాడ్ బృందాలు ముమ్మర తనిఖీలు సాగిస్తున్నాయి. ఇప్పటికే భద్రత కోసం 11 మంది ఐపీఎస్ ఐదుగురు డిఐజి స్థాయి అధికారులతో పోలీసులు కార్యాచరణ సిద్ధం చేసేస్తున్నారు.
చార్మినార్ దగ్గర ఇవాంకా కి గాజులు ...
అమెరికా అధ్యక్షుని కుమార్తె ఇవాంక ను చార్మినార్ సందర్శించేలా చేసి భాగ్యనగర గాజుల సొగసులు ఆమెకి చూపాలని భావిస్తున్నారు. దాంతో పాత బస్తీ ప్రాంతంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. చార్మినార్ ప్రాంతంలో తనిఖీలు మరింత ముమ్మరంగా సాగిస్తున్నారు. ఇవాంకా , ప్రధాని తదితరులు పర్యటించే ప్రాంతాలన్నీ ఇప్పటినుంచే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గ్లోబల్ సమ్మిట్ ను విజయవంతం చేయడంతో బాటు హైదరాబాద్ నగరాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయడానికి తెలంగాణ సర్కార్ ఈ కార్యక్రమాన్ని వినియోగిస్తుంది. దాంతో ప్రతిష్టాత్మకంగా భావించి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను సమన్వయ పరిచి పరుగులు పెట్టిస్తుంది టి ప్రభుత్వం.
- Tags
- ఇవాంకా భాగ్యనగరం

