చంద్రబాబుపై జగన్ సరికొత్త అస్త్రం ...?

గత 2014 ఎన్నికల్లో టిడిపి ప్రకటించిన మ్యానిఫెస్టో మాయం అయ్యిందా ? అవునంటున్నారు వైసిపి అధినేత జగన్. కర్నూల్ జిల్లా పాదయాత్రలో వున్న వైఎస్ జగన్ టిడిపి అధినేత పై యధావిధిగా నిప్పులు చెరిగారు. ఆ విమర్శల్లో కొత్త అంశాన్ని జగన్ ప్రజల ముందు ఉంచారు. టిడిపి వెబ్ సైట్ కి వెళ్ళండి. అందులో మీకు గత ఎన్నికల్లో ఆ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలు లిస్ట్ కనపడదు. అదో పెద్ద బుక్. అందులో చెప్పినవి ఏవీ అధికారంలోకి వచ్చాక వారు చేయకపోవడంతో మ్యానిఫెస్టో అందులో తొలగించారంటూ చెప్పుకొచ్చారు. తమ పార్టీ వారిలా మోసం చేయదని తమ మ్యానిఫెస్టో రెండు పేజీలకన్నా ఎక్కువ ఉండదని పేర్కొన్నారు జగన్. ఇచ్చిన హామీలు ఇవ్వనివి కూడా చేసి 2024 ఎన్నికలకు ప్రజలముందుకు వచ్చి ఆశీర్వదించమంటామని తెలిపారు.
అందుకేనా తొలగించారు ...?
తెలుగుదేశం పార్టీ తన వెబ్ సైట్ లో వాస్తవంగా గత ఎన్నికల మ్యానిఫెస్టో ఉంచలేదు. కారణం 600 లకు పైగా హామీలను పెద్ద బుక్ లెట్ రూపంలో ఆ పార్టీ విడుదల చేసింది. అందులో కొన్ని హామీలు తప్ప చాలా వాటిలో అమలు చేయకపోవడంతో మ్యానిఫెస్టో జోలికి పోవడం మంచిది కాదని ఆ పార్టీ ఈ వివరాలు వెబ్ సైట్ లో పెట్టలేదంటున్నారు విశ్లేషకులు. రాష్ట్ర విభజన తో అప్పులకుప్పలు, ఇచ్చిన హామీలు అమలు చేస్తే మరింత గా ఆర్ధిక పరిస్థితి దిగజారే ప్రమాదం ఉండటంతో కొన్ని మాత్రమే టిడిపి సర్కార్ అమలు చేయగలుగుతుంది. రైతు రుణమాఫీ, ద్వాక్రా రుణాల మాఫీ పూర్తిగా అమలు కాలేదు. ఇక కాపులను బిసిల్లో చేర్చే అంశం కమిషన్ వేసి సరిపుచ్చింది. ప్రతి కులానికి ఒక్కో హామీ ఇచ్చిన టిడిపి వాటిని అమలు చేయలేక చేతులు ఎత్తేసింది. పెన్షన్ల స్కిం బాగా అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు పెండింగ్ లోనే వున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలకు టిడిపి కొత్తగా హామీలు ఇచ్చినా ఎక్కువ మంది నమ్మే పరిస్థితి ఉండదని గ్రహించే వైసిపి అధినేత కొత్త ప్రచారం మొదలు పెట్టేశారు.
- Tags
- జగన్ చంద్రబాబు

