చంద్రబాబు పై చెలరేగిన సీఎం ...!

పోలవరం కోసం కాంగ్రెస్ అంటూ ఆ పార్టీ చేపట్టిన మహా పాదయాత్ర ప్రారంభ సభలో పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి ఏపీ సీఎం చంద్రబాబు పై చెలరేగిపోయారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ నే అని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించింది కాంగ్రెస్ అని గుర్తుపెట్టుకోవాలి కోరారు. కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్ట్ కోసం చేపట్టిన మహా పాదయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి యాత్ర ప్రారంభించారు నారాయణ స్వామి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఒక రేంజ్ లో నిప్పులు చెరిగారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై. ఏపీ సీఎం చంద్రబాబు తక్షణం కేంద్రంలోని బిజెపి కూటమి నుంచి వైదొలగి రాష్ట్ర ప్రయోజనాలకోసం పోరాటం చేయాలని ఆయన డిమాండ్ చేశారు లేనిపక్షంలో తమపార్టీ 2019 లో అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ చేతుల మీదుగా ప్రారంభం అవుతుందన్నారు.
బాబు మోడీ భేటీ లైవ్ ఇవ్వాలన్న రఘువీరా ....
తెలుగుదేశం ఎంపీలు బతిమాలాగా బతిమాలాగా ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ లభించిందన్నారు రఘువీరా. కీలకమైన అంశాలు రాష్ట్ర ప్రయోజనాల రీత్యా చర్చ జరగనున్న నేపథ్యంలో మోడీ బాబు నడుమ సమావేశాన్ని లైవ్ టెలికాస్ట్ చేయాలన్నారు రఘువీరా. చంద్రబాబు సర్కార్ దమ్ము ధైర్యం లేని దద్దమ్మ అని నిప్పులు చెరిగారు. మహా పాదయాత్ర సభలో పాల్గొన్న రాజ్య సభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు పోలవరం ఏపీ జీవనాడిగా కేంద్రం గుర్తించి జాతీయ ప్రాజెక్ట్ గా ఇచ్చిందన్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్యం, చేయడం, నాణ్యత ప్రమాణాలు పాటించకపోవం తో ఉద్యమించాల్సి వచ్చింది అని ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ వెనుకడుగు వేయదన్నారు కెవిపి. సతీసమేతంగా ప్రాజెక్ట్ కోసం నాలుగు రోజులు పాదయాత్ర మొదలు పెట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఆయన.
- Tags
- చంద్రబాబు

