చంద్రబాబు తెలివికి వీరు ఢమాల్...!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు క్లాస్ పీకారంటే ఆలా ఇలా ఉండదు. నిత్యం టెలి వీడియో కాన్ఫరెన్స్ లు, పార్టీ నేతలకు, కార్యకర్తలకు, ప్రజలకు క్లాసులు పీకడంలో బాబు అనేక దశాబ్దాలుగా ఎంతో సీనియర్ అన్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఆయన వివాదాస్పదంగా మారిన ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులకు తనదైన శైలిలో క్లాస్ పీకారు. దెబ్బకి వారంతా చంద్రబాబు ఇచ్చిన క్లాస్ తో సెట్ అయిపోయారు. ఇంతకీ బాబు ఎందుకు క్లాస్ పీకాలిసివచ్చింది అంటే.
టవర్లు ఎక్కి ఎవరిని బెదిరిస్తారు ...?
తమ కెరియర్ నాశనం అయిపోతుందన్న ఆందోళనతో తమ సమస్య పరిష్కరించాలని కోరుతూ ఫాతిమా కళాశాల విద్యార్థులు సెల్ టవర్లు ఎక్కారు. వారిని బుజ్జగించిన అధికారులు వారందరిని ముఖ్యమంత్రి తో సమావేశం అయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశంలో సీఎం తనదైన శైలిలో క్లాస్ తీసుకున్నారు. ఏం ఎవరిని బెదిరించాలనుకుంటున్నారు..? మీ సమస్య కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు సమక్షంలో వుంది. రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది. మీరు టవర్లు ఎక్కి బెదిరిస్తే పనులు కావు అంటూ సుతిమెత్తగా సైకాలజిస్ట్ లా క్లాస్ తీసుకున్నారు సీఎం. త్వరలో మళ్ళీ భేటీ అయి చర్చిద్దామని వారిని పంపి వేసి అసెంబ్లీలో కేంద్రం చొరవ తీసుకోవాలని తీర్మానం చేశారు చంద్రబాబు.
సీఎం ను కలిశాక రెండు వర్గాలుగా విద్యార్థులు ...
చంద్రబాబు ను కలిశాకా విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయారు. అమరావతి దగ్గర ధర్నా చౌక్ లో కొందరు తాము కట్టిన ఫీజులు కళాశాల నుంచి ఇప్పిస్తే చాలని అంటే మరికొందరు మెడికల్ సీట్లు కోసం తగాదా పడ్డారు. మొత్తానికి ఈ వివాదాన్ని మాత్రం చంద్రబాబు తెలివిగా కేంద్రం పై పెట్టి అక్కడి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.
- Tags
- చంద్రబాబు

