చంద్రగ్రహణం రోజు చిన్నారిని చంపింది ఇంటి ఓనరేనా?

ఉప్పల్ చిలకనగర్‌లో జరిగిన నరబలి కేసును పోలీసులు ఛేదించారు. ఇంటి యజమాని రాజశేఖర్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తేల్చారు. పాపను చంపింది తానేనని పోలీసుల విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు. కరీంనగర్ తండా నుంచి పాపను తీసుకొచ్చినట్లు నిందితుడు పోలీసులకు వివరించాడు. ఉప్పల్ చిలుకానగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజశేఖర్ క్యాబ్‌డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య ఆరోగ్యం బాగుండటం లేదని పూజారుల వద్దకు తిరిగాడు. పూజారులు చెప్పిన విధంగా చంద్రగ్రహణం రోజు క్షుద్రపూజలు నిర్వహించాడు. క్షుద్రపూజలో భాగంగా అప్పటికే తాము కొనుగోలు చేసిన చిన్నారిని బలి ఇచ్చాడు. అనంతరం ఉదయం మొండాన్ని మాయం చేసిన రాజశేఖర్, తలను ఇంటి దాబాపై ఉంచాడు. తలను మాయం చేయడానికి వీలుకాకపోవడంతో తన ఇంటిపై పాప తల ఉందని పోలీసులకు సమాచారం అందించాడు. అయితే రాత్రి ఆరవేసిన బట్టలు తీయడానికి కుటుంబ సభ్యులు భవనంపైకి వెళ్లారని. ఉదయం 11 గంటల సమయంలో వెళ్లిన వారికి సుమారు మూడునెలల వయస్సు కలిగిన చిన్నారి తలను గమనించానని రాజశేఖర్ స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. జాయింట్ సీపీ తరుణ్‌జోషి, డీసీపీ ఉమామహేశ్వరశర్మ, ఏసీపీ కృష్ణమూర్తి సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. వీరితోపాటు డాగ్‌స్కాడ్, క్లూస్‌టీం, ఎస్ఓటీ విభాగాలు కేసులో భాగమై ఆధారాలు సేకరించాయి. తలభాగం లభించినా చిన్నారి వివరాలు తెలియలేదు. వీటితోపాటు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు.. ఈ ప్రాంతంలోని వారికి ఏమైనా సంబంధాలు ఉన్నా యా.. మిస్సింగ్ కేసులు ఎక్కడైనా ఉన్నాయా .. అనే కోణంతోపాటు ఇతర భాగాలపై దృష్టిసారించారు.
అసలు విషయం ఏమిటంటే...?
రాజశేఖర్ ఇచ్చిన సమాచారంతో అతడి ఇంటి సమీపంలోని నరహరి ఇంటిలో క్షద్ర పూజలు జరిగినట్లు గుర్తించారు. గ్రహణ సమయంలో పూజలు చేసి పాపను బలిచ్చినట్లు పోలీసులను రాజశేఖర్ తప్పదారి పట్టించాడు. పోలీసులు మెకానిక్ నరహరి, అతని కొడుకు రంజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించిన పోలీసులకు నేరానికి పాల్పడినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదు. కేసు విషయంలో రాజశేఖర్ వ్యవహార శైలిపై అనుమానం రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో నిందితుడు తాను చేసిన ఘోరాన్ని ఒప్పుకున్నాడు.ఈ కేసులో పోలీసులు పూజారితో సహా ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాడు. పాప కొనుగోలు విషయంలో మధ్యవర్తిత్వం వహించిన బ్రోకర్లను సయితం అరెస్టు చేశారు.తమకు ఇలాంటివి తెలియవని రాజశేఖర్ అమ్మ తెలిపారు.టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెండినా..ఇలాంటి మూఢనమ్మకాల హత్య తమకాలనిలో జరగడం బాధాకరమని ష్టానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
- Tags
- చిన్నారి బలి

