Sun Mar 29 2026 17:46:26 GMT+0530 (India Standard Time)
గొంతు నొక్కేస్తున్నారన్న సోము వీర్రాజు

తన గొంతు నొక్కే కుట్ర జరుగుతుందని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. తనను అమిత్ షా మందలించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్న సోము వీర్రాజు అధికార టీడీపీ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తే ఎలాంటి సంకేతాలు వెళతాయన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఆందోళన పరిస్థితులకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. తనను వైసీపీ కోవర్టుగా టీడీపీ నేతలు అనడం నవ్వు తెప్పిస్తుందన్నారు. కేంద్రం నిజంగా అన్యాయం చేస్తే ఢిల్లీకి వెళ్లి మాట్లాడాలన్నారు. నిన్న బంద్ సందర్భంగా తనను ఇంటి నుంచి బయటకు రానివ్వలేదని ఆరోపించారు. హోంమంత్రి వైఖరి ఏంటో అర్థం కావడం లేదన్నార. పవన్ కల్యాణ్ జేపీతోనూ, ఉండవల్లితోనూ జేఏసీ ఏర్పాటు చేయడం మంచిదేనన్నారు.
- Tags
- సోము వీర్రాజు
Next Story

