Sat Apr 11 2026 06:32:54 GMT+0530 (India Standard Time)
గాలి దూకుడుకు హైకోర్టు బ్రేక్

మైనింగ్ వ్యాపారి గాలి జనార్థన్ రెడ్డికి హైకోర్టులోచుక్కెదురైంది. గాలి జనార్థన్ రెడ్డి లండన్ వెళ్దామనుకున్నారు. ఈ మేరకు హైకోర్టులో అనుమతి కోరుతూ పిటిషన్ వేశారు. లండన్ వెళ్లేందుకు వీలు లేదని హైకోర్టు తీర్పుచెప్పింది. ఈ నెల 5వ తేదీ నుంచి 20 వరకూ లండన్ లో పర్యటించేందుకు తనను అనుమతించాలని హైకోర్టును గాలి జనార్థన్ రెడ్డి అభ్యర్థించారు. తన పాస్ పోర్టును ఇప్పించాలని కోరారు. అయితే హైకోర్టు ఇందుకు తిరస్కరించింది. గాలికి లండన్ వెళ్లడానికి అనుమతిస్తే.. మరో విజయమాల్య అవుతారని సీబీఐ న్యాయవాది వాదించారు. సీబీఐ వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
Next Story

